న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. బాలీవుడ్ గాయని కనికాకపూర్ నిర్లక్ష్యంతో కరోనా భయాందోళనలు తాజాగా పార్లమెంటు దాకా పాకాయి. కనికా కపూర్ తనకు కోవిడ్-19 (కరోనా) పాజిటివ్ అని తేలిందని, దీంతో తన కుటుంబం మొత్తం సెల్ఫ్ నిర్బంధంలోకి పోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో కరోనా తుట్టె కదిలింది. పలువురు ఎంపీలు సహా, కనికాతో కలిసిన, సన్నిహిత మెలిగిన వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కనికా నిర్లక్ష్యంతో పార్లమెంటులో కలకలం